తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం

తిరుమల కొండపై అన్యమత ప్రచారం అవాస్తవం
తిరుమల కొండపై పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇందుకు ప్రభుత్వమే కారణమంటూ ఆరోపణలు చేసారు. అయితే ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 2013 అని #FactCheckApGov తనిఖీబృందం గుర్తించింది.
దురుద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఫేక్ వార్తను ప్రచురించినట్టు నిర్థారించింది. మొండితోక సుధీర్ అనే వ్యక్తి 2013లో తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నవిషయాని ఒక టీవీ ఛానెల్ వెలుగులోకి తెచ్చింది.
Video News Link: https://www.youtube.com/watch?v=f4FR7IfuHBQ
దీని ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం అతడిపై కేసు నమోదు చేయగా, అక్టోబర్ 2014 లో పోలీసులు దీనిపై విచారణ జరిపారు. అతడితోపాటు మరో నలుగురిని అరెస్టు చేసారు.
Action by Police: https://www.thehindu.com/news/national/andhra-pradesh/evangelist-sudhir-arrested-admits-to-offence/article6549272.ece
ఈ వివాదాస్పదమైన ట్వీట్లను పోలీస్ సైబర్ విభాగానికి పంపగా, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
