Analysis Schemes

ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వాస్తవ తనిఖీ

Q. రేషన్‌ కార్డులు 2019 వరకు ఎన్ని? 2019 తరవాత ఎన్ని?
2019 వరకు రాష్ట్రంలో సగటున1.39 కోట్లకార్డులు అమలులో ఉన్నవి ప్రస్తుతం రాష్ట్రంలో 1.45కోట్లకార్డులు అమలులో ఉన్నవి.

Q. 2019 తరవాత వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న బియ్యం క్వాంటిటీ ఎంత? క్వాలిటీ పరంగా ఎంత ఇంప్రూవ్‌ చేశారు?

Q. బియ్యం మీద 2014–19 మధ్య నాటి ప్రభుత్వం చేసిన వ్యయం ఎంత? ఇప్పుడు ఈ మూడేళ్ళలో మన ప్రభుత్వం చేసిన వ్యయం ఎంత?

Q. ఇంటింటికీ వెళ్ళి రేషన్‌ ఇచ్చే విధానం తీసుకురావటం ద్వారా వచ్చిన ప్రయోజనం ఎంత? ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంత?
ఇంటింటికీ వెళ్ళి రేషన్‌ ఇచ్చే విధానం తీసుకురావటం ద్వారా ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ.25కోట్లు ఖర్చు చేస్తోంది.

ప్రజా పంపిణీవ్యవస్థ –పాతక్రొత్తవిధానాలు:

Q. సార్టెక్స్‌ క్వాలిటీ బియ్యం మీద, వాటి ప్యాకింగ్‌మీద… ఇలా ప్రతి అంశంలోనూ తీసుకుంటున్న శ్రద్ధ ఎంత? అందుకోసం చేస్తున్న ఖర్చు ఎంత?
నూకలు, ఇసుక, మట్టి , రాళ్లు, చెడిపోయిన బియ్యం గింజలు, రంగు మారిన బియ్యం గింజలు, పరిపక్వము కాని బియ్యం గింజలు, పట్టు తక్కువ బియ్యంప్రమాణాలు కలిగినసార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయబడుతోంది మరియు GPS ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా స్టాక్‌లను చౌకధరల దుకాణాలకు సరఫరా చేయబడుతోంది.సార్టెక్స్ చేయుటకు గాను ప్రతి కిలో కు రూ.1 చొప్పున సుమారు ప్రతి నెల రూ.20 కోట్లుఖర్చుచేయడం జరుగుచున్నది ఇంకనుమొబైల్ వాహన ఆపరేటర్లకు నెల చెల్లింపు మరియు నెలవారీ కిస్తి క్రిందప్రభుత్వం సుమారుప్రతి నెల సుమారు రూ.25కోట్లు ఖర్చు చేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో గోధుమపిండి, కందిపప్పు, రాగులు, జొన్నలు, ఉప్పు… ఇలా అనేకం ఇచ్చారని రాశారు. సంవత్సరాల వారీగా వాటి క్వాంటిటీ, ఖర్చు, ప్రజలకు అందిన వివరాలు.

  • సుమారు 1.38 కోట్ల కార్డులకు గాను అతి కొద్ది మందికి అనగా సుమారు 1% లోపు కార్డుదారులకు మాత్రమేగోధుమపిండి, కందిపప్పు, రాగులు, జొన్నలు, ఉప్పుపంపిణి జరిగినది. మిగిలిన కార్డులకు పంపిణి జరుగలేదు.
  • రాగులు మరియుజొన్నలను బహిరంగ మార్కెట్లో కొని కార్డుదారులకు సరఫరా చేయడం కారణంగాకేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ డబ్బులు పొందలేక పోయాము.
  • అంతేకాక సదరు రాగులు జొన్నల యొక్క పరిమాణమునకు సమానమైన బియ్యం పై కూడా కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ డబ్బులు పొందలేక పోయాము. ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించ వలసి వచ్చింది.
  • కావున ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాణ్యమైన తినగలిగే సార్టేక్స్ బియ్యమునుఇంటింటికి మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు అందించడం జరుగుతున్నది. అంతే గాక బలవర్ధకమైన బియ్యమునుపంపిణి ఆరు జిల్లాలో  ఏప్రిల్ 2022 నుండిఅమలు చేయడం జరిగినది.

ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో ఇస్తున్న చక్కెర, కందిపప్పు వంటి వాటి వివరాలు…

ప్రస్తుతముబియ్యం కార్డులకు బియ్యము, కందిపప్పు, పంచదారపంపిణి వివరాలు…